Neeti Kadhalu
Posted by Superadmin on October 08 2018 06:56:11

 

నీతి కథలు

 

  1. సందేహం
  2. చాణక్యుని గ్యానోదయం
  3. పొగరుగల గొర్రెపోతు
  4. ధనవంతురాలి గిన్ని
  5. పులి చేతిలో గాజు
  6. చాకలోడి గాడిద
  7. కోపం వచ్చిన కోతులు
  8. బ్రాహ్మడి మేక
  9. మాధవ ముంగిస
  10. కన్న మమకారం
  11. మిణుగురు పురుగు, కాకి
  12. మంత్రి, సామంతరాజు
  13. నక్కా, కోడి పుంజు
  14. నక్కా, సింహం, జింకా
  15. కప్పా, పాము
  16. కుక్కా, వ్యాపారస్తుడు
  17. ఇద్దరు శిశ్యుల కథ
  18. నక్కా, పీతలు
  19. చారలు కోరిన నక్క
  20. అద్దం, రాయి
  21. కోతి, అద్దం
  22. మూడు చేపల కథ
  23. వేరుశనగ దొంగ
  24. దీపావళి పోటీ
  25. నోరు జారిన మాటలు
  26. కాకి దాహం
  27. అమ్మాయి కలలు
  28. సింహము-ఎలుక
  29. పాము-స్నేహం
  30. అద్దం లో మనిషి
  31. అత్యాశగల కుక్క
  32. పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక
  33. అఙ్నానం, మూర్ఖత్వం
  34. నిరక్షర కుక్షి
  35. అలవాటు
  36. గొడవ పడి ఏమి లాభం?
  37. నాన్నా! పులి!
  38. నిజాయితి గల ఆవు
  39. పొగడ్తలతో పడగొట్టిన నక్క
  40. బంగారు గుడ్లు పెట్టే కోడి
  41. మొసలి కన్నీళ్లు
  42. డేరా లో ఒంటె
  43. నూతిలో నక్క
  44. ఎనుగ తో స్నేహం
  45. ఉల్లిపాయి దొంగ
  46. నక్క ఆహ్వానం
  47. పెద్ద అపాయం, చిన్న ఉపాయం
  48. బంగారు పళ్ళం
  49. తెలివి తక్కువ సింహం
  50. పుల్లని ద్రాక్షపళ్ళు
  51. తుర్రుమన్న తోడేలు
  52. ఎద్దు కొమ్ముపై ఈగ
  53. సికమోర చెట్టు
  54. గుంటనక్కకి గుణపాఠం
  55. అహంభావి మేకలు
  56. కొంగ కోరికలు
  57. జింక కొమ్ములు
  58. పిల్లికి గంట ఎవరు కడతారు?
  59. విన్నవన్నీ నిజం కాదు
  60. చీమ సహాయం
  61. కుందేలు, తాబేలు మధ్య పరుగు పందెం
  62. కొంగలు, తాబేలు
  63. కర్రల కట్ట
  64. గుమ్మడికాయ దొంగ
  65. ఎలుగుబంటి చెప్పిన రహస్యం
  66. ఎలుక ఆకలి
  67. గుడ్డి నమ్మకం
  68. కట్టెలు కొట్టే వాడి కథ
  69. పక్షుల ఐక్యత
  70. మొండి గాడిద
  71. గాడిద మేటు
  72. గొంగూర నాడే 
  73. రాజుగారి కోతి
  74. గంట మొగించేది ఎవరు?
  75. కోతి కుతూహలం
  76. అడవిపంది దంతాలు
  77. బాటసారుల అదృష్టం
  78. ఒక కోతీ, రెండు పిల్లులు
  79. దేవుడే కాపాడతాడు!

 

  1. సందేహం

 

సందేహం

By Anu on జూలై 8, 2009

అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”
గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాదు సంతోషంగా వెళ్ళాడు.

 

 

 

చాణక్యుని గ్యానోదయం

By Anu on జూలై 8, 2009

చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు.
ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్యారాడు. దారి లో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “యేమైంది బాబు!” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా వుంది, చేయి కాలిందమ్మ” అన్నాడు.

“అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే వున్నావు,” అంది అవ్వ. “యెవరైన అన్నం మధ్యలో చేయి పెడతార? పక్కలనుంచి చిన్నగా తింటూ రవాలికాని?”

ఇదంతా అరుగుమీంచి వింటున్న చాణక్యుడికి గ్యానొదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.

ఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది.

 

 

 

 

పొగరుగల గొర్రెపోతు

By Anu on జూలై 8, 2009

ఒకానొకప్పుడు ఒక అడివిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా వుండేది. తన కొమ్ములతో యెవ్వరినైన ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గొర్రెపోతులా తయ్యారయ్యింది. వచ్చే పొయే ప్రతి చిన్న జీవినీ తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దెగ్గిరకు వెళ్ళి ఆ నక్క “ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు – నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను” అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. “ఆ విరొధి యెవరు?” అని నక్కను అడిగింది. “అదుగో ఆ కొండను చూడు – యెంత యెత్తుగా కనిపిస్తొందో! దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది” అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపొయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపొయాయి. గొర్రెపోతు బుధ్ధి తెచ్చుకుని అందరితో వినయంగ మెలగడం నేర్చుకుంది.

ఇందిలో నీతి యేమిటంటే, యెదుటి వారి బలం తెలీయకుండ మనం విర్రవేగిపోకూడదు.

 

 

 

కోపం వచ్చిన కోతులు

By Anu on జూలై 9, 2009

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది.

ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి.

మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి.

రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.

 

 

 

 

బ్రాహ్మడి మేక

By Anu on జూలై 11, 2009

Brahmin and goat

 

 

 

అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.

మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు.

బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.

కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.

“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ.

ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…

ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.